మీరు మైగ్రేన్ తో బాధపడుతున్నారా... అయితే ఇలా  ఒక లుక్కు వేయండి..

Suma Kallamadi

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధ పడుతూనే ఉంటారు. ఇటీవల మైగ్రేన్‌  బాధితులు చాలా ఎక్కువ అయ్యారు. ఎవరికైతే మైగ్రేన్‌ తలనొప్పి ఉంటే ఎంతగా బాధపెడుతుందో అనుభవించేవారికి మాత్రమే తెలుసు ఆ బాధను  వర్ణించడానికి వారికీ సాధ్యం కాదు. ప్రాణాంతకం కాకపోయినా.. దానిని భరించడం కష్టసాధ్యమే అని తెలుస్తుంది. ఒక వేళా అది విద్యార్థులు మైగ్రేన్ తో బాధపడుతుంటే చదువునూ, పనిచేసేవారైతే వాళ్ల పనినీ తీవ్రంగా ఆటంకపరుస్తు అనేక ఇబ్బందులను ఎదురుకుంటారు.

 

 

అలాంటి మైగ్రేన్‌ బాధితులందరికీ ఇప్పుడు వాళ్ళకి ఒక శుభవార్తే. వాళ్ల కోసం లాస్మిడిటాన్‌ అనే మందు యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీయే) ఆమోదం లభించింది. కాకపోతే లాస్మిడిటాన్‌ మందు వాడాక కనీసం 8 గంటల పాటు ఎలాంటి డ్రైవింగు పనులు చేయకూడదు. అలా డ్రైవింగ్ చేయడం వల్ల మందు సరిగ్గా పనిచేయకపోవచ్చు. అదొక్కటే ఈ మందుతో ఉన్న పెద్ద ఇబ్బంది. ఇక త్వరలోనే మరో ఒక  కొత్త ఔషధం కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు.  దీనిని ఇంకా ట్రయల్స్‌ చేస్తున్నారు. త్వరలో  ట్రయల్స్‌ ముగించుకొని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. ఈ కొత్త మందు పేరు  ‘ఉబ్రోజపాంట్‌’ గా నిర్ణయించడం జరిగింది.

 

 

ప్రస్తుతం మైగ్రేన్‌ తలనొప్పికి వాడుతున్న మందులు ఇలా పనిచేస్తాయి. రక్తనాళాలను కాస్తంత సన్నబరిచేలా చేసి, బాధ ఉన్న చోట రక్తం ఒకింత తక్కువ అందేలా చేయడం ద్వారా సహాయ పడుతున్నాయి. కానీ ఇలాంటి చికిత్స గుండెజబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన  జబ్బులు ఉన్నవారికి అంత మంచిది కాదు ఇవి. ఇప్పుడు ఉన్న మందులు వాడడం వలన కొన్ని రోజులకు గుండెపోటు పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటివారిలో అది గుండెపోటు లేదా పక్షవాతానికి కారణం కావచ్చు. కానీ లాస్మిడిటన్, ఉబ్రోజపాంట్‌ అలా కాదు. 

 

తలనొప్పికి కారణమవుతుందని భావిస్తున్న ప్రోటీన్‌ను టార్గెట్‌ చేసి నొప్పి కలిగించే ఆ ప్రోటీన్‌పై దాడి చేయడం ద్వారా వారి తలనొప్పిని నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  న్యూయార్క్‌లోని మోంటెఫోయిర్‌ హెడేక్‌ సెంటర్‌లో ఆధ్వర్యంలో ట్రయల్స్‌లో ఉన్న ఉబ్రోజపాంట్‌ మందు గురించిన వివరాలు ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘జామా’లో ప్రచురితమయ్యాయి ఇది చదివిన మైగ్రేన్ బాధితులు చాలా ఆనందాని వ్యక్తం చేయడం జరిగింది. ఇది కూడా అందుబాటులోకి  మైగ్రేన్‌ రోగులకు ఎంతగానో వెలుసుబాటు కలుగుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: